ప్రభాస్ సినిమా విలన్ గా కనిపించనున్న కోలీవుడ్ స్టార్

Surya will Become a Villain for Prabhas Movie | Telugu Movie News
x

ప్రభాస్ సినిమా విలన్ గా కనిపించనున్న కోలీవుడ్ స్టార్

Highlights

ప్రభాస్ సినిమా విలన్ గా కనిపించనున్న కోలీవుడ్ స్టార్

Prabhas Movie: ఇప్పటికే "సలార్", "ఆదిపురుష్" వంటి సినిమాలు చేస్తున్న ప్రభాస్ నాగ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" సినిమాతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాని తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ తాజాగా షూటింగ్ డేట్లను 260 రోజులకి ఎక్స్టెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మరియు మే లో సినిమాలో నటించబోతున్న స్టార్ కాస్ట్ మొత్తం షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఎన్జీకే వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించిన సూర్య ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ఫ్యూచర్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అన్ని శక్తులు ఉన్న సూపర్ హీరో గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. 2023 లో ఈ సినిమా అన్ని ఇంటర్నేషనల్ భాష లలో విడుదల కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories