Surya: "అలాంటి కథ వస్తే కచ్చితంగా జ్యోతిక తో నటిస్తా" అంటున్న సూర్య

Surya Revealed About Story to do Film With Jyothika
x

జ్యోతికతో ఎలాంటి మూవీ చేయాలనుకుంటున్నాడో చెప్పిన సూర్య (ఫైల్ ఇమేజ్)

Highlights

Surya: "అలాంటి కథ కోసం ఎదురు చూస్తున్నాను" అంటున్న సూర్య

Surya: కోలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒకరైన జ్యోతిక మరియు సూర్య ఇప్పటి దాకా కలిసి ఆరేడు సినిమాల్లో నటించారు. అందులో దాదాపు అన్నీ సూపర్ హిట్. కానీ గత కొంత కాలంగా జ్యోతిక ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాల్లో మెరుస్తున్న జ్యోతిక సూర్యతో మాత్రం వెండితెరపై కనిపించి చాలా రోజులు గడిచింది. జ్యోతిక సూర్య నటిస్తున్న సినిమా లకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుని చాలాకాలం గడిచింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు అందరూ కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటుండగా సూర్య కి అలాంటి ప్రశ్న ఎదురైంది.

"నేను దర్శకుడిని కాదు. రైటర్ ని కూడా కాదు. కేవలం ప్రొడ్యూసర్ని మాత్రమే. నాకు కావాల్సింది ఒక మంచి కథ. ఒకవేళ మేము కలిసి సినిమా చేయాలంటే అది అన్ని సినిమాల్లో లాగా ఉండకూడదు. ఇప్పటిదాకా మేము చాలా సినిమాల్లో నటించాము. కాబట్టి మేము మళ్ళీ కలిసి నటించాలంటే స్క్రిప్టులో ఏదో ఓ కొత్తదనం ఉండాలి. అలాంటి కథ ఎదురైతే మేము కచ్చితంగా కలిసి నటిస్తాము" అని క్లారిటీ ఇచ్చారు సూర్య. ఇక సినిమాల పరంగా సూర్య ప్రస్తుతం జై భీమ్ మరియు రాకెట్రీ సినిమాలతో బిజీగా ఉండగా మరోవైపు జ్యోతిక ఈ మధ్యనే ఉదాన్పిరప్పే అనే సినిమాలో కనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories