Surya: సూర్య కొత్త సినిమా పోస్టర్.. సంథింగ్ స్పెషల్

Surya: కోలివుడ్ అగ్రకథానాయకుడు సూర్య విలక్షణమైన పాత్రలతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు

Samba Siva Rao
Published on: 9 April 2021 6:13 PM IST
Surya: సూర్య కొత్త సినిమా పోస్టర్.. సంథింగ్ స్పెషల్
X

Surya: కోలివుడ్ అగ్రకథానాయకుడు సూర్య విభిన్న చిత్రాలు చేస్తూ తనకంటూ ట్రెండ్ చేసుకున్నారు. విలక్షణమైన పాత్రలతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కొత్తదనం కోసం ఆయన తాపత్రయపడటం వల్లనే ప్రేక్షకుల ముందుకు 'ఆకాశం నీ హద్దురా' సినిమా వచ్చింది. ఆ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికి మంచి స్పందన వచ్చింది. తాజాగా సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది.

సూర్య కెరీర్ 40వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదల చేసిన లుక్ కీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య లుక్ డిఫరెంట్ గా ఉంది .. ఆయన ఖడ్గం పట్టుకుని నడుస్తున్న తీరు చూస్తుంటే కథా నేపథ్యమే భిన్నంగా ఉండనుందనే విషయం అర్థమైంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారి బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఈ మూవీలో సూర్య సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.

కోలీవుడ్ లో కొత్తదనానికి ప్రాధాన్యతను ఇచ్చే హీరోల్లో కమల్, విక్రమ్ తరువాత స్థానంలో సూర్యనే కనిపిస్తాడు. తమిళంలోనే కాదు, ఇటు తెలుగులోను సూర్యాకు మంచి మార్కెట్ ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పాండిరాజ్ కి కోలీవుడ్ లో మంచి పేరు ఉండటం ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story