Surya Kiran-Kalyani Divorce: ఆ తెలివి తక్కువ పనితో దిగజారిపోయారు.. సూర్యకిరణ‌-కల్యాణిల విడాకులపై క్లారిటి ఇచ్చిన సుజిత..!

Surya Kiran-Kalyani Divorce: నటి కల్యాణి, ఆమె భర్త, దర్శకుడు సూర్య కిరణ్‌ల విడాకులపై నటి సుజిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 31 July 2023 6:40 PM IST
Surya Kiran and Kalyani Divorce With Huge Financial Problems Says Actor Sujitha
X

Surya Kiran-Kalyani Divorce: ఆ తెలివి తక్కువ పనితో దిగజారిపోయారు.. సూర్యకిరణ‌-కల్యాణిల విడాకులపై క్లారిటి ఇచ్చిన సుజిత..!

Surya Kiran-Kalyani Divorce: నటి కల్యాణి, ఆమె భర్త, దర్శకుడు సూర్య కిరణ్‌ల విడాకులపై నటి సుజిత కీలక వ్యాఖ్యలు చేశారు. చెల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సుజిత.. అటు సీరియల్స్, ఇటు సినిమాలతో తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది. అయితే, ఆమె అన్నయ్య డెరెక్టర్ సూర్యకిరణ్ కూడా తొలి నాళ్లలో మాంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ, ఆ తర్వాత వరుస ఫెయిలూర్స్‌తో వెనుకజంలో పడ్డాడు. నటుడిగానూ కొన్ని సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం కనుమరుగయ్యాడు. అయితే, తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన సుజిత.. తన అన్నయ్య సూర్యకిరణ‌్ విడాకులకు దారితీసిన పరిస్థితులను వివరించింది.

సుజిత మాట్లాడుతూ.. 'అన్నయ్య సూర్యకిరణ్‌కు వివాహమైన 3 ఏళ్లకే నాకు కూడా పెండ్లి చేశారు. అన్నయ్యతో తరచుగా ఫోన్‌ మాట్లాడతాను. ఒకవేళ హైదరాబాద్‌లో షూటింగ్‌ కోసం వస్తే.. అన్నయ్యను తప్పకుండా మీట్ అవుతాను. వదిన (నటి కల్యాణి) టాలీవుడ్‌లో గొప్ప నటిగా వెలుగొందుతోంది. వదినతో చాలా సరదాగా గడిపేదాన్ని. మేం వదినా, మరదళ్లులా కాకుండా అక్కాచెల్లెళ్లులా ఉండేవాళ్లం' అంటూ చెప్పుకొచ్చింది.

'బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. లేదంటే జీవితం సమస్యల్లో కూరుకపోతుంది. ఇలాంటి సమస్యల్లోనే అన్నయ్య, వదినలు చిక్కుకున్నారు. అదే సమయంలో అన్నయ్య నిర్మాతగా ఓ సినిమా తీశాడు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి' అంటూ పేర్కొంది.

'ఆ సినిమా దారుణంగా దెబ్బతీసింది. భారీగా నష్టాలు వచ్చాయి. ఆ విషయం మాకు తెలిసేలోపే వారి పరిస్థితి దిగజారిపోయింది. దీంతో ఉన్నదంతా అమ్మేశారు. మాకు కేరళలో ఓ ప్రాపర్టీ ఉంది. దాన్ని కూడా అప్పులు తీర్చేందుకు అమ్మేశారు. సినిమా అనేది ఓ గ్యాంబ్లింగ్‌. అందరికీ ఇది కలిసి రాదు. ఉన్న డబ్బునంతా సినిమాకోసమే పెట్టేశారు. ఆ తెలివితక్కువ తనంతో నిండా మునిగిపోయారు. దీంతో వారిమధ్య మనస్పర్థలు పెరిగాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు' అంటూ సుజిత చెప్పుకొచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story