Singham 4 Movie: 'సింగం 4' కు రంగం సిద్ధం

Singham 4 Movie: సౌత్ స్టార్ సూర్య తన కెరీర్‌లో చాలా హిట్ సినిమాలు కలిగి ఉన్నాడు.

Venkata Chari
Updated on: 25 May 2021 10:51 AM IST
Suriya to kickstart Singham 4 soon
X

సూర్య (ఫొటో ట్విట్టర్)

Singham 4 Movie: సౌత్ స్టార్ సూర్య తన కెరీర్‌లో చాలా హిట్ సినిమాలు కలిగి ఉన్నాడు. సింగం సిరీస్‌ నిస్సందేహంగా అతని ప్రాజెక్టులలోని బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలలో ఒకటి.

తాజా నివేదికల ప్రకారం, సింగం సిరీస్ లో నాలుగో భాగం ప్రస్తుతం చర్చల్లోకి వచ్చింది. సింగం 4 షూటింగ్ త్వరలోనే మొదలుకానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. పుకార్ల మేరకు మొదటి షూటింగ్ షెడ్యూల్ ఈ ఏడాది ఆగస్టు లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

హరి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేయనున్నాడు. హై-ఓల్టేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా మొదటి మూడు సినిమాల కంటే భిన్నంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లతో రాబోతోందంట. ఈ సినిమాలోనూ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల 'ఆకాశమే నీ హద్దురా' సినిమాతో సూపర్ హిట్ సాధించాడు సూర్య.

Venkata Chari

Venkata Chari

Next Story