Suriya: మేము గర్భంలో ఉన్నప్పుడే కలిసాము అంటున్న సూర్య

Suriya Paid Tributes at Puneeth RajKumar Memorial
x

మేము గర్భంలో ఉన్నప్పుడే కలిసాము అంటున్న సూర్య(ఫైల్ ఫోటో)

Highlights

* ఆయన నవ్వు ఎప్పుడు మన మనసుల్లో పదిలం అంటున్న సూర్య

Suriya: ప్రముఖ నటుడు పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణం సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు. ఆయన హఠాన్మరణంతో ఇప్పటికీ అభిమానులు నమ్మలేకపోతున్న ఒక చేదు నిజం. పునీత్ కుటుంబ సభ్యులే కాక ఇండస్ట్రీ నుండి కూడా పునీత్ సన్నిహితులు పునీత్ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పిస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా అక్కడ తన స్నేహితునికి నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా తో మాట్లాడుతూ పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునని భావోద్వేగానికి లోనయ్యారు.

ఇది చాలా దురదృష్టకరం. ఇలా జరిగి ఉండకూడదు. పునీత్‌ ఇక లేరన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. మా కుటుంబాల మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. పునీత్‌ అమ్మగారు మరియు మా అమ్మ ఇద్దరూ గర్భిణులుగా ఉన్న సమయంలో తొలిసారి కలిశారట.

అలా మేము అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం. పునీత్‌ ప్రతి ఫొటోలో, వీడియోలో నవ్వుతూనే కనిపించేవారు. తన జ్ఞాపకాలు ఎప్పటికీ మన మనసుల్లో పదిలంగా ఉంటాయి. తన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు సూర్య.

Show Full Article
Print Article
Next Story
More Stories