Suriya 47: మళ్లీ పోలీస్ అవతారం ఎత్తనున్న సూర్య?

Suriya 47 After Singam Suriya to Play a Badass Cop in Aavesham Directors Next
x

Suriya 47: మళ్లీ పోలీస్ అవతారం ఎత్తనున్న సూర్య?

Highlights

స్టార్ హీరో సూర్య 'సింగం' సిరీస్‌తో పోలీస్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ పోలీస్ రోల్‌లో కనిపించనున్నాడు. తన 47వ చిత్రంలో బ్యాడాస్ పోలీస్‌గా నటిస్తున్నాడు.

Suriya 47: తమిళ స్టార్ హీరో సూర్య పోలీస్ పాత్రలకు మంచి పేరు తెచ్చుకున్నాడు. 'కాకా కాకా' (తెలుగులో 'ఘర్షణ') తర్వాత 'సింగం' సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ సంపాదించాడు. మూడు చిత్రాలతో ఈ సిరీస్ పూర్తయిన తర్వాత సూర్య నుంచి పోలీస్ జానర్ సినిమా రాలేదు. అయితే ఇప్పుడు తన 47వ చిత్రంతో మళ్లీ పోలీస్ అవతారం ఎత్తనున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఆవేశం' దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సూర్యని బ్యాడాస్ పోలీస్‌గా చూపించనున్నారు. ఈ చిత్రం కోసం ప్రత్యేక ప్రోమో కట్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రోమోను విడుదల చేయనున్నారు. సూర్య ఈసారి ఎలాంటి పోలీస్ పాత్రలో కనిపిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories