Suresh Babu: టాలీవుడ్‌‌కు కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్న సురేష్‌బాబు

Suresh Babu: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మరో నూతన డైరెక్టర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు.

Venkata Chari
Updated on: 2 Jun 2021 11:00 PM IST
Suresh Babu Introduces Another New Director
X

సురేష్ బాబు (ఫొటో ట్విట్టర్)

Suresh Babu: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మరో నూతన డైరెక్టర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా తీయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మంచి కంటెంట్ తో వచ్చిన కొత్త డెరెక్టర్స్ కి అవకాశం ఇచ్చి లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లను, నటీనటులను, ఇతర సాంకేతిక నిపుణులను టాలీవుడ్‌కి పరిచయం చేశారాయన.

రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసి యంగ్ టాలెంట్ ని పైకి తీసుకొస్తున్నాడు. తాజాగా సురేశ్ బాబు.. రామానాయుడు ఫిలిం స్కూల్ పూర్వ విద్యార్థినే డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. సతీష్ అనే యువకుడిని డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడంట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓ ఉత్కంఠ భరితమైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో ఈ సినిమాను తీయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో దగ్గుబాటి హీరోలెవరైనా నటిస్తారా లేదా నూతన వాళ్ళతో తీస్తారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా సమాచారం రానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సురేష్ బాబు.. విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే మలయాళ హిట్ సినిమా 'దృశ్యం 2' తెలుగు రీమేక్ ని కూడా నిర్మిస్తున్నాడు. దగ్గుబాటి రానా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రాన్ని కూడా సమర్పిస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story