మరొక చిన్న సినిమా పై దృష్టి పెట్టిన సురేష్ బాబు

మరొక చిన్న సినిమా పై దృష్టి పెట్టిన సురేష్ బాబు
x
Highlights

ఈ మధ్యనే 'వీరభోగ వసంత రాయలు' అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో శ్రీవిష్ణు 'బ్లఫ్ మాస్టర్' సత్యదేవ్ తో చేతులు కలిపి ఒక మల్టీ స్టారర్ సినిమాతో...

ఈ మధ్యనే 'వీరభోగ వసంత రాయలు' అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో శ్రీవిష్ణు 'బ్లఫ్ మాస్టర్' సత్యదేవ్ తో చేతులు కలిపి ఒక మల్టీ స్టారర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'బ్రోచేవారెవరురా' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నివేదాథామస్ మరియు నివేదపేతురాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

తాజా సమాచారం ప్రకారం టీజర్ కు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాత మరియు పంపిణీదారుడు అయిన దగ్గుబాటి సురేష్ బాబు ఈ చిత్రం హక్కులను చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. కంటెంట్ బాగా నచ్చడంతో వెంటనే సురేష్ బాబు ఈ సినిమాను కొన్నట్లు సమాచారం. ఇప్పటికే 'పెళ్లిచూపులు', 'కేరాఫ్ కంచరపాలం' వంటి చాలా చిన్న సినిమాలకు చేయూత నిచ్చి తన సొంత బ్యానర్ లో విడుదల చేసిన సురేష్ బాబు దృష్టి ఇప్పుడు 'బ్రోచేవారెవరురా' పై పడింది.




Show Full Article
Print Article
Next Story
More Stories