"నాన్నకు నేనే తలకొరివి పెట్టాను" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సురేఖ వాణి కూతురు సుప్రీత

Surekha Vani - Supritha: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత నెటిజన్లకు సుపరిచితురాలు...

admin1
Updated on: 28 Feb 2022 12:47 PM IST
Surekha Vani Daughter Supritha Emotional Post About Her Father | Tollywood News
X

"నాన్నకు నేనే తలకొరివి పెట్టాను" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సురేఖ వాణి కూతురు సుప్రీత

Surekha Vani - Supritha: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత నెటిజన్లకు సుపరిచితురాలు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన తల్లితో కలిసి ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్నామధ్య సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పుకార్లు వినిపించినప్పుడు సుప్రీత సోషల్ మీడియాలో వారందరికీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమ్మకి తన కెరియర్ కంటే నా కెరియర్ మీదనే ఎక్కువ ఫోకస్ అని చెప్పుకొచ్చింది. ఇక రెండవ పెళ్లి పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం అది తనకే వదిలేస్తాను అని చెప్పింది సుప్రీత. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది. అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది అని చెప్పింది సుప్రీత

తాజాగా తన మరణించిన తండ్రి గురించి తలుచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది సుప్రీత. "మా నాన్న చనిపోయినప్పుడు తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అందుకే నేనే పెట్టాను. నాన్న తరపు బంధువులు కనీసం చివరి చూపు చూసేందుకు కూడా రాలేదు. నాన్న సొంత సోదరుడు పాడె మోయకండి అని బంధువులకు చెప్పారు. ఆ సమయంలో అన్నీ అమ్మ తరుపు బంధువులు చూసుకున్నారు. ఇవన్నీ ఎవరికీ తెలియదు" అని చెప్పుకొచ్చింది సుప్రీత.

admin1

admin1

Next Story