Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన జైలర్‌.. ఒక్కో టికెట్‌ 300 నుంచి 1000 రూపాయలు..

Jailer Movie: థియేటర్ల దగ్గర తలైవా అభిమానుల సందడి

Shekhar G
Published on: 10 Aug 2023 11:28 AM IST
Superstar Rajinikanth Starrer Jailer Released Today
X

Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన జైలర్‌.. ఒక్కో టికెట్‌ 300 నుంచి 1000 రూపాయలు..

Jailer Movie: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. రజనీ అభిమానులు భారీ ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నారు. చెన్నైలోని థియేటర్లలో అభిమానుల సందడి మొదలయ్యింది. తెల్లవారుజాము నుంచే థియేటర్లకు చేరుకున్న అభిమానులు డప్పువాయిద్యాలు, ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొన్నది.

టిక్కెట్‌ను దక్కించుకునేందుకు అభిమానులు పోటీ పడటంతో థియేటర్‌ యజమానులు టిక్కెట్‌ ధరలను అమాంతం పెంచేశారు. ఒక్కో టికెట్‌ 300రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పలుకుతోంది.మాల్స్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్లలో టిక్కెట్స్‌ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. రెండు రోజుల కిత్రమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా 6 లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయమయ్యాయి. దీంతో ‘జైలర్’ హవా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనంలా మోతమోగిపోతోంది. ఎప్పటిలాగానే కొత్త సినిమా విడుదల కాగానే ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లే తలైవా హిమాలయాలకు వెళ్లిపోయారు.

Shekhar G

Shekhar G

Next Story