Superstar: సూపర్‌ స్టార్‌ అభిమానులకి మరింత నిరాశ.. ఎందుకంటే ఆయన అలా ఉండాలనే..!

Superstar: తన విలక్షణ నటన, ఆకట్టుకునే స్టైల్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

Arun Chilukuri
Updated on: 31 May 2023 8:30 PM IST
Superstar Rajinikanth Political Entry Issue Rajinis Brothers Comments
X

Superstar: సూపర్‌ స్టార్‌ అభిమానులకి మరింత నిరాశ.. ఎందుకంటే ఆయన అలా ఉండాలనే..!

Superstar: తమిళనాట ఆయన అభిమాన దేవుడు. ఎందుకంటే ఆయన ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే. ఇప్పటికే అర్థమైపోతుంది ఆయన మరేవరో కాదు మన సూపర్‌స్టార్‌ రజనీయే అని. తన విలక్షణ నటన, ఆకట్టుకునే స్టైల్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలా రోజులుగా చర్చ జరుగుతుంది.అయినప్పటికీ సున్నిత మనస్కుడైన రజనీ దీనిని చాలా రోజులుగా వాయిదావేస్తూ వస్తున్నారు. ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించినప్పటికీ తర్వాత అనారోగ్యం కారణంగా వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రజనీకాంత్ బ్రదర్ అయిన సత్యనారాయణ రావు ఆయన పొలిటికల్‌ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. దీనికి కారణం ఆయన ఏడు పదులు దాటడమేనని తెలిపారు. ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. సత్యనారాయణ సోమవారం తిరుచెందూర్‌ కుమారస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రజనీ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.

రజనీ బ్రదర్‌ నిర్ణయంతో ఆయన అభిమానులు చాలా నిరాశలో పడిపోయారు. ఎందుకంటే రజనీకాంతో ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారని చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు సత్యనారాయణ వ్యాఖ్యలతో అసలు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఇక ప్రస్తుతం రజినీకాంత్‌ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే జైలర్, లాల్‌ సలాం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై చిత్ర విచిత్రాలు జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం ఆరోగ్యంగా ఉండాలని అభిమాన తారాగణం కోరుకుంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story