Sreekaram Movie: రివ్యూలన్నీ హిట్ టాక్.. కలెక్షన్స్‌లో వీక్!

Sreekaram Movie: కొన్నిసార్లు సినిమా బాగుందని ప్రేక్షకుడు తీర్పిచ్చినా.. కలెక్షన్లు మాత్రం రావు.

Venkata Chari
Published on: 16 March 2021 5:15 PM IST
Superhit Reviews for Sreekaram Movie But Disastrous Collections
X

శ్రీకారం సినిమా పోస్టర్

Sreekaram: కొన్నిసార్లు సినిమా బాగుందని ప్రేక్షకుడు తీర్పిచ్చినా.. కలెక్షన్లు మాత్రం రావు. అలాంటి జాబితాలో చేరబోతున్నట్లుంది శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమా. సోషల్ మీడియాలో, రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చినా.. అవి సినిమా కలెక్షన్ లకు ఎటువంటి హెల్ప్ చేయలేకపోయాయి.

కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం మార్చి 11, 2021 న విడుదలైంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. వ్యవసాయం.. దాని చుట్టూ తిరిగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం విఫలమైంది. ఈ సినిమాలో అన్ని వాణిజ్య అంశాలతోపాటు ప్రీ-రిలీజ్ లో మంచి హైప్ ను క్రియోట్ చేసింది. కలెక్షన్ల పరంగా మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేక చతికలపడింది.

శని, ఆదివారాల్లో కూడా ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉందని పంపిణీదారులు అంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా బ్రేక్-ఈవెన్ చేరుకోవడానికి రూ. 16 కోట్లు కావాలి. కలెక్షన్ల పరంగా వీక్ గా ఉండడంతో శర్వానంద్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ గా నిలవబోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story