మళ్లీ శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నా సూపర్ స్టార్

Super Star Rajinikanth Planning to do Another Movie With Peddanna Movie Director Siva
x

 శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నా సూపర్ స్టార్

Highlights

* మళ్లీ అదే దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్న రజినీకాంత్

Rajinikanth - Siva: సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్నవి సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ స్టార్ డైరెక్టర్లతో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రజినీకాంత్. ఈ మధ్యనే "దర్బార్" సినిమా మంచి విజయాన్ని అందుకున్న రజనీకాంత్ తాజాగా ఇప్పుడు శివ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ శివ దర్శకత్వంలో "ఆన్నాతే" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలు పాత్రలో కనిపించబోతున్నారు.

తాజాగా రజినీ తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రజినీకాంత్ మరొకసారి అదే డైరెక్టర్ తో పనిచేయాలని అనుకుంటున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అయితే సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ ఇప్పటికే ఈ సినిమాకి సైన్ చేశారని తెలుస్తోంది. కానీ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం త్వరలోనే వెలువడనుంది అని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories