Super Star Rajinikanth: దీపావళికే రజనీకాంత్ అన్నత్తై

Super Star Rajinikanth: రజనీకాంత్ అన్నత్తై సినిమా రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.

Kranthi
Published on: 2 July 2021 2:36 PM IST
Super Star Rajinikanth Annaatthe Movie Release Date
X

Super Star Rajinikanth Annaatthe

Super Star Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాంటి సినిమా చేసినా కూడా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచే అసలైన హంగామా మొదలవుతుంది. ఇక అన్నత్తై సినిమా రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళికికి రిలీజ్ చేయబోతున్నారు. కమర్షియల్ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తలైవా విబిన్నమైన స్టైల్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా మాస్ జనాలు విజిల్స్ వేసేలా స్క్రిప్ట్ రెడీ చేసే శివ ఈసారి కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా కారణంగా షూటింగ్ కు ఆలస్యం అవ్వడంతో సినిమా విడుదల పై రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా మొదలైన తర్వాత రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. దాంతో షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ సమయంలోనే రజినీకాంత్ అనారోగ్యానికి గురవ్వడం, దాంతో ఆయన రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకోవడం.. ఆతర్వాత దేశంలో కరోనా ఉధృతి పెరగడం.. ఇలా రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ప్రస్తుతం దర్శకుడు శివ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఇక మొదటి నుంచి ఈ సినిమా పై వస్తున్న వార్తలను నిజం చేస్తూ .. రజినీకాంత్ అన్నాత్తే సినిమా ను దీపావళికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన విడుదల చేసారు. దర్శకుడు శివ గత సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోవడంతోపాటు రికార్డ్ లను కూడా క్రియేట్ చేసాయి. దాంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మరి అన్నతే ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.


Kranthi

Kranthi

Next Story