Rang De: 'రంగ్ దే' సాంగ్ రిలీజ్ చేసిన సూపర్ స్టార్

Rang De: 'రంగ్ దే' మూవీలోని 3వ సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ లో విడుదల చేశారు.

Venkata Chari
Updated on: 4 March 2021 7:19 PM IST
Super Star Mahesh Babu Releases Nithins Range De Movie Third Song
X

రంగ్ దే సినిమాలో నితిన్, కీర్తి సురేష్

Rang De: నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన 'రంగ్ దే' మూవీలోని 3వ సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ లో విడుదల చేశారు. సాంగ్ రిలీజ్ సందర్భంగా ప్రిన్స్ రంగ్ దే టీం ను అభినందించాడు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాలా ఆకట్టుకున్నాయి.

కాగా, ఈ మూడో పాట సినిమాకు చాలా కీలకమని చిత్ర యూనిట్ చెబుతోంది. 'నా కనులు ఎపుడు' అనే ఈ సాంగ్ ను శ్రీమణి రచించాడు. అలాగే ఈ సాంగ్ ను సిద్ శ్రీరామ్ పాడారు. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్షన్ చేశాడు. వెండితెర మీద ఈ సాంగ్ చాలా బాగుంటుందని యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది. మార్చి 26న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రమోషన్లు కూడా మొదలుపెట్టింది రంగ్ దే యూనిట్. ప్రముఖ నటుడు నరేష్, కౌసల్య, రోహిణి, బ్రంహాజీ, వెన్నెల కిషోర్, వినీత్, గాయత్రీ రఘురామ్, సత్యం రాజేష్, అభినవ్ గోమాతం, సుహాస్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story