Mahesh Babu-Rajamouli: మహేష్ తో జక్కన మాస్టర్ ప్లాన్..

Mahesh Babu-Rajamouli: ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా ఫైనల్ అని చెప్పేశాడు రాజమౌళి.

Kranthi
Published on: 1 July 2021 8:58 AM IST
Super Star Mahesh Babu Rajamouli Movie Update
X

Mahesh Babu-Rajamouli:(File Image)

Mahesh Babu-Rajamouli: జూ.ఎన్టీఆర్ కు సింహాద్రి.. నితిన్ కు సై.. ప్రభాస్ కు ఛత్రపతి.. ఇక ఆ తర్వాత హీరో పేరు వదిలేశారు.. రాజమౌళి పేరే మార్మోగిపోయింది. ఆయన సినిమా అంటే ఆ హీరో ఫ్యాన్స్ పండగ చేసుకోవడమే ఇక. బాహుబలితో జక్కన్న క్రేజ్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో ఇద్దరు క్రేజీ హీరోలతో మల్టీ స్టారర్ చేస్తూ.. కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు రాజమౌళి. ఆ సినిమా హిట్టా కాదా అన్న దిగులే లేదు ఎవరికీ. ఆ సినిమా అయిపోయింది.. నెక్స్ట్ ఏంటి అనేవారికి ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా ఫైనల్ అని చెప్పేశాడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా జక్కన్న తమ హీరోను ఎలా చూపిస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఏ స్టయిల్ లో సినిమా తీస్తాడో.. ఎలాంటి స్టోరీ తీసుకుంటాడో అని తెగ ఆలోచించేస్తున్నారు.

ఇప్పటికే సర్కారువారి పాట సినిమా మంచి క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందనేది అంచనా. అటు మహేష్ బాబు.. ఇటు రాజమౌళి.. ఇక హీరోయిన్ ఎవరో.. విలన్ ఎవరో అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.

సినిమా సెట్స్ పైకి రాక ముందే ఇంత చర్చ జరుగుతుందంటే.. ఇక మొదలయ్యాక కేక పుట్టించడం ఖాయం. మహేష్ బాబును రాజమౌళి జేమ్స్ బాండ్ తరహాలో చూపిస్తాడని కొందరు, కాదు సీరియస్ సోషల్ సబ్జెక్టుతో వస్తున్నాడని మరికొందరు ఇలా ఎవరికివారు చెప్పుకుంటున్నారు. కొన్ని రోజులు ఆగితే అన్నిటికి క్లారిటీ వచ్చేస్తుంది.

Kranthi

Kranthi

Next Story