Mahesh Babu with Trivikram : మహేష్ తో మరోసారి మాటల మాంత్రికుడు?

Mahesh Babu with Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది.

Krishna
Published on: 31 Aug 2020 6:25 PM IST
Mahesh Babu with Trivikram : మహేష్ తో మరోసారి మాటల మాంత్రికుడు?
X

Mahesh Babu,Trivikram

Mahesh Babu with Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా లాంటి సినిమాలు వచ్చాయి. అతడు వెండితెర పై పెద్దగా ఆడకపోయిన బుల్లితెర పైన ఆదరగోట్టింది. ఇక ఖలేజా ప్లాప్ అయినప్పటికీ చాలా మందికి ఇది ఓ స్పెషల్ మూవీ.. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారని సమాచారం.. ఇప్పటికి ఇద్దరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తో మూవీని కంప్లీట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమాని చేయనున్నారని సమాచారం..

ప్రస్తుతం మహేష్ బాబు గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. బ్యాంకింగ్ లోని లోపాలను ఎత్తి చూపుతూ ఈ కథ సాగనుందని సమాచారం..త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

అటు త్రివిక్రమ్ ఈ ఏడాది అల వైకుంఠపురంలో అనే చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు.. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది.

Krishna

Krishna

Next Story