HBD Goutham krishna : గౌతమ్ పుట్టిన రోజు.. మహేష్ ఎమోషనల్ ట్వీట్

HBD Goutham krishna : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ నేడు 14వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా గౌతమ్

Krishna
Published on: 31 Aug 2020 10:28 AM IST
HBD Goutham krishna : గౌతమ్ పుట్టిన రోజు.. మహేష్ ఎమోషనల్ ట్వీట్
X

Mahesh Babu, Goutham krishna

HBD Goutham krishna : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ నేడు 14వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా గౌతమ్ మహేష్ అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. మహేష్, నమ్రత దంపతులకి గౌతమ్ కృష్ణ 2006లో జన్మించాడు. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు.

ఇక గౌతమ్ చిన్నప్పటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ మహేష్ బాబు, నమ్రతలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా గౌతమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. " మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడిగా నువ్వు పెరిగి పెద్దగా అవుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డొరేమాన్ టు అపెక్స్ లెజెండ్ వ‌ర‌కు నీతో క‌లిసి నేను జ‌ర్నీ చేయ‌డం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టిన‌రోజు కావాలి" అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ఇక అటు నమ్రత గౌతమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. "నువ్వు మా జీవితాల్లోకి వ‌చ్చాక ఎంతో మార్పు వ‌చ్చింది. సంతోషం, ప్రేమ‌ను తెచ్చావు. ప్రతి ఏడాది ఇలానే జీవితంలో ప్రేమ‌, సంతోషం పెరుగుతూ రావాలి"అంటూ విషెస్ ని అందించింది.. ఇక మహేష్ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. 2005 ఫిబ్రవరి 10 న ముంబైలో హిందూ సంప్రదాయం ప్రకారం మహేష్ , నమ్రతా అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. వీరు అంతకుముందు వంశీ అనే సినిమాలో కలిసి నటించారు.



Krishna

Krishna

Next Story