SSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమాపై షాకిచ్చిన మేకర్స్

Mahesh Babu Trivikram
x

మహేశ్-త్రివిక్రమ్ ఫైల్ ఫోటో

Highlights

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మళ్లీ వీరిద్దరి సినిమా ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. ఎన్నో అనూహ్య పరిణామాల తరువాత ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం.. అదే బ్యానర్‌లో మళ్లీ మహేష్ బాబు-త్రివిక్రమ్తో సినిమా ఓకే అవ్వడం అంతా చకచకా జరిగిపోయింది.

అలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఓ రేంజ్‌లో అంచనాలుంటాయి. శనివారం సాయంత్రం 4 గం. 5 నిమిషాలకు మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతోందని ప్రకటించారు. కానీ తీరా ఆ సమయం వచ్చే సరికి ప్లేట్ ఫిరాయించారు. ఇక ఆలస్యం అవుతుందని, మీ ఎదురుచూపులకు తగ్గట్టే అది ఉంటుంది. ఆ అప్డేట్ గురించి మీకు తెలుసు అంటూ నిర్మాతలు ట్వీట్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

వీరిద్దరి కాంబోలో గతంతో అతడు సినిమా వచ్చింది. అతడు సినిమా వెండితెరపై ఎలా ఉన్నా.. బుల్లితెరపై మీద ఇప్పటికే ఎన్నో వందల సార్లు ప్రసారం చేసినా కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ మీద అందరికీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఖలేజా మూవీ అందుకోలేకపోయింది. ఖలేజ తర్వాత మహేశ్-త్రివిక్రమ్ మధ్య గ్యాప్ పెరిగిందని వదంతులు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో సినిమా రానుందని తెలియడంతో అవన్ని రూమర్స్ అని తెలిపోయాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories