Super Star Krishna: మహేష్ సినిమాల విషయంలో నమ్రత తలదూర్చదు

* నమ్రత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణ

admin1
Updated on: 31 Aug 2021 4:00 PM IST
Super Star Krishna Says Namrata Shirodkar Will Not Involve in Mahesh Babu Movies Matter
X

నమ్రత పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణ(ఫైల్ ఫోటో) 

Super Star Krishna: సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ 59 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో మైల్ స్టోన్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి "మోసగాళ్లకు మోసగాడు". తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలై 5 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ కృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ మహేష్ బాబు సక్సెస్ వెనకాల నమ్రత ఇన్వాల్వ్మెంట్ గురించి రియాక్ట్ అయ్యారు. నమ్రత ఒక గృహిణి అని ఆమె తన కుటుంబాన్ని పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుందని, మహేష్ సినిమాల విషయంలో మాత్రం తను అసలు ఇన్వాల్వ్ అవ్వదు అని షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చారు సూపర్ స్టార్.

వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండే మహేష్ బాబు అటు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా బిజీగా ఉంటారు. ఈ విషయాలలో నమ్రత మహేష్ బాబు కి సపోర్ట్ చేస్తుందని, అసలు మహేష్ బాబు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో మొత్తం ఆమె చూసుకుంటుందని కొందరి అభిప్రాయం. ఇక నమ్రత శిరోద్కర్ గురించి మాట్లాడుతూ వారి ఇద్దరి మధ్య బంధం తండ్రి కూతురు లా ఉంటుందని, ఆమె తన మిగతా కూతుళ్లతో కూడా చాలా బాగా కలిసిపోయిందని చెప్పుకొచ్చారు కృష్ణ. ఇక రమేష్ బాబు సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోలేకపోవడంతో సక్సెస్ అందుకోలేకపోయాడని, అందుకే నటన మానేసి నిర్మాణం వైపు వెళ్లారని చెప్పారు కృష్ణ.

admin1

admin1

Next Story