నాది చాలా ఛాలెంజింగ్ పాత్ర అంటున్న సామ్

నాది చాలా ఛాలెంజింగ్ పాత్ర అంటున్న సామ్
x
Highlights

పెళ్లి తరువాత నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తున్న మొదటి చిత్రంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా 'మజిలి'. భారీ అంచనాల మధ్య ఈ...

పెళ్లి తరువాత నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తున్న మొదటి చిత్రంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా 'మజిలి'. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో దివ్యంశ కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో రకరకాల లేయర్స్ ఉంటాయని సమంత చెప్తోంది. హీరోకి అప్పటిదాకా ఒకమ్మాయి ని ప్రేమిస్తాడు. అంతసేపు వారిని చూసి ఆనందించిన ప్రేక్షకులు తన పాత్రని అంగీకరించాలని, అంటే తొలి సన్నివేశం నుండే తనను తాను నేను ప్రూవ్ చేసుకోవాలి అని సమంత చెబుతోంది.

తనది చాలా చాలెంజింగ్ పాత్ర అని, కొన్నిసార్లు కళ్లతో కుడా భావాలు పలికించాలి అని, కేవలం తన అభినయంతోనే అంతా చెప్పగలగాలి అని చెప్పింది సామ్. పెళ్లయ్యాక చై తో నటించడం గురించి చెబుతూ, "నాకు ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా సరే నా పాత్రకు నేను 100 శాతం న్యాయం చేశానా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను" అని సామ్ పేర్కొంది. షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ కి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories