Super Deluxe: ఆగస్టు 6న ఆహాలో సూపర్ డీలక్స్

Super Deluxe: విభిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా ఓటీటీలో మరో సూపర్ హిట్ సినిమా విడుదల కానుంది.

Arun Chilukuri
Updated on: 5 Aug 2021 3:24 PM IST
Super Deluxe Movie Gets Release Date
X

Super Deluxe: ఆగస్టు 6న ఆహాలో సూపర్ డీలక్స్

Super Deluxe: విభిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా ఓటీటీలో మరో సూపర్ హిట్ సినిమా విడుదల కానుంది. కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించిన సూపర్ డీలక్స్ ఆగస్టు 6న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు.

నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల సమాహారంగా సూపర్ డీలక్స్‌ను తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి, సమంత, ఫహద్‌ఫాజిల్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అసలు ఈ నలుగురు జీవితాల్లో ఏం జరిగింది? ఆ పరిస్థితుల నుంచి వాళ్లెలా బయటపడ్డారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం సూపర్ డీలక్స్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story