logo

వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్ గా డబ్ స్మాష్ పిల్ల

వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్ గా డబ్ స్మాష్ పిల్ల
Highlights

ఈ మధ్యనే 'ఎఫ్ 2' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్...

ఈ మధ్యనే 'ఎఫ్ 2' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగర్తాండ' అనే సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్యాంగ్స్టర్ కామెడీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తమిళ నటుడు మురళీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం డబ్ స్మాష్ ల తో బాగా పాప్యులర్ అయిన మ్రిణాలిని రవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యనే తమిళంలో 'సూపర్ డీలక్స్' అనే చిత్రంలో కనిపించిన ఈమె ఇప్పుడు తెలుగులో సైతం అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మధ్యనే ఈమె టెస్ట్ షూట్ కి కూడా వెళ్లిందని, ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది అని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ యు.ఎస్.లో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ సంవత్సరం రెండవ భాగంలో విడుదల కానుంది.


లైవ్ టీవి


Share it
Top