ఎన్నారై పాత్రలో కనిపించనున్న సన్నీలియోన్

ఎన్నారై పాత్రలో కనిపించనున్న సన్నీలియోన్

admin1
Updated on: 16 March 2022 8:01 AM IST
Sunny Leone Will Be Seen in The Role of NRI | Telugu News
X

ఎన్నారై పాత్రలో కనిపించనున్న సన్నీలియోన్

Sunny Leone: బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. 2017 లో రాజశేఖర్ హీరోగా నటించిన "పిఎస్వి గరుడ వేగా" సినిమాలో ఐటమ్ సాంగ్ లో నర్తించిన సన్నీ లియోన్ తన డాన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు మంచు విష్ణు మరియు పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "గాలి నాగేశ్వర రావు"లో సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను అందించిన కోన వెంకట్ సినిమా గురించి అందులోని పాత్రల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

సన్నీ లియోన్ ఈ సినిమాలో ఒక ఎన్ ఆర్ ఐ అమ్మాయి పాత్రలో కనిపించనుందట. రేణుక అనే ఒక ఎన్నారై పాత్రలో సన్నీలియోని ఈ సినిమాలో భారతదేశంలోని ఒక పల్లెటూరి కి వచ్చి విష్ణు పాయల్ లకు మంచి స్నేహితురాలు అవుతుందని, వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా సన్నీ లియోన్ పాల్గొంది. సినిమాకి సంబంధించిన చాలా వరకు షూటింగ్ తిరుపతి దగ్గర రంగంపేట లో జరిగింది. ఇషాన్ సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

admin1

admin1

Next Story