సన్నీ షూటింగ్ కి ముహుర్తం ఫిక్స్

సన్నీ షూటింగ్ కి ముహుర్తం ఫిక్స్
x
Highlights

ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనే కాక ఇతర భాషల్లో కూడా ఈమె ఇప్పటికే కొన్ని ఐటం సాంగ్...

ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనే కాక ఇతర భాషల్లో కూడా ఈమె ఇప్పటికే కొన్ని ఐటం సాంగ్ లలో నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన 'పిఎస్వి గరుడవేగ' సినిమా లో కూడా స్పెషల్ సాంగ్ లో తన పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది సన్నీ. ప్రస్తుతం సన్నీ లియోన్ చేతిలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉంది. అదే 'వీరమ దేవి'. ఈ సినిమా కొన్ని నెలల క్రితమే లాంచ్ అయ్యింది. వీసీ వడివుడైయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీలియోన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

వార్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని స్టీవ్స్ కార్నర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవదీప్ ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ను లాంచ్ చేసినప్పటికి ఇంకా ఈ చిత్రం షూటింగ్ మొదలవలేదు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల ఆఖరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్ర షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి సినిమాని ఈ సంవత్సరం రెండవ భాగం లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పక్కన పెడితే సన్నీ లియోన్ చేతిలో మరి కొన్ని ఆఫర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories