Pushpa Movie: "పుష్ప"లో ఐటెం సాంగ్ కోసం "సన్నీ లియోన్"..!!

Sandeep Reddy
Published on: 26 July 2021 12:46 PM IST
Sunny Leone May Perform Item Song in Sukumar Pushpa Movie
X

సన్నీ లియోన్ - అల్లు అర్జున్ 

Pushpa Movie: సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. "జగడం" సినిమాలో "36 24 36", "ఆర్య" సినిమాలో "అ అంటే అమలాపురం" అయిన ఇటీవల విడుదల అయిన "రంగస్థలం" సినిమాలో "జిగేలు రాణి" అయిన ఐటెం సాంగ్స్ లో ట్రెండ్ సెట్ చేసినవే. తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" చిత్రంలో కూడా మరొక ఐటెం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఈ చిత్ర యూనిట్ సన్నీ లియోన్ ని కాంటాక్ట్ అయినట్టుగా సమాచారం. అయితే "పుష్ప" సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి సన్నీ లియోన్ కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.

సుమారుగా మూడు నిమిషాల నిడివి గల ఆ సాంగ్ లో అల్లు అర్జున్ తో డాన్స్ చేయడానికి ఈ భామ 70 లక్షలు డిమాండ్ చేసినట్టు సినీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అడిగినంత ఇవ్వడానికి చిత్ర యూనిట్ కూడా సానుకూలంగానే ఉన్నారని ఒకవేళ అదే కనుక నిజం అయితే "గరుడ వేగ" సినిమా తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులు సన్నీ లియోన్ ని వెండితెరపై చూడబోతున్నరన్నమాట. ఇటీవలే హైదరాబాద్ లో 30 రోజుల షూటింగ్ షెడ్యుల్ మొదలుపెట్టిన వారం రోజులకే సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడటంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన అల్లు అర్జున్ కి జోడిగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతాన్ని అందిస్తున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story