"నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నాను" అని అభిమాని గురించి పోస్ట్ చేసిన సన్నీ లియోన్

Sunny Leone: పోర్న్ స్టార్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సన్నీ లియోన్ హిందీలో "జిస్మ్ 2" ఈ సినిమాతో హీరోయిన్ గా మారారు..

Shireesha
Updated on: 18 March 2022 2:00 PM IST
Sunny Leone Instagram Post for Her Fan | Sunny Leone Latest News
X

"నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నాను" అని అభిమాని గురించి పోస్ట్ చేసిన సన్నీ లియోన్

Sunny Leone: పోర్న్ స్టార్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సన్నీ లియోన్ హిందీలో "జిస్మ్ 2" ఈ సినిమాతో హీరోయిన్ గా మారారు. కరెంట్ తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు సన్నీ. "గరుడ వేగా" సినిమాలో రాజశేఖర్ సరసన ఒక ఐటెం సాంగ్ లో కూడా నర్తించిన సన్నీలియోన్ ఈ మధ్యనే "అనామిక" అనే వెబ్ సిరీస్ లో కనిపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సన్నీలియోన్ తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియో ని షేర్ చేసుకున్నారు.

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న "గాలి నాగేశ్వరరావు" సినిమాలో సన్నీ లియోన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్ తిరుపతిలో జరిగింది. ఆ సమయంలో ఒక అభిమాని సన్నీ ని కలిసి తన టాలెంట్ చూపించాడు. సన్నీలియోన్ పేరుని ఆ వీరాభిమాని పచ్చబొట్టు వేయించుకున్నాడు.

దీంతో ఆశ్చర్యపోయిన సన్నీ లియోన్ ఇంస్టాగ్రామ్ లో ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇలా అన్నారు. "నువ్వు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటావు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే నీకు వేరే దారి లేదు. నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నాను" అని అన్నారు సన్నీ లియోన్. తాజాగా ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Shireesha

Shireesha

Next Story