Sunitha Boya: షూటింగ్స్ లేక పొట్టకూటికోసం రోడ్డెక్కిన సునీత

కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో మార్చేసింది. ముఖ్యంగా సినీరంగంలోని క్యారెక్టర్ ఆర్టిస్టుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి.

Shireesha
Published on: 11 Jun 2021 3:55 PM IST
Sunitha Boya Struggling Due to Lack of Shooting
X

సునీత బోయ (ఫొటో ట్విట్టర్)

Sunitha Boya: కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో మార్చేసింది. ముఖ్యంగా సినీరంగంలోని కార్మికులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని కలగన్న ఓ యువతి ప్రస్తుతం పొట్టకూటికోసం రోడ్డెక్కింది.. వెండితెర వెలుగుల్లో తనను తాను చూసి మురిసిపోవాలనుకున్న ఆమె కుటుంబం కోసం రోడ్డుపక్కన పండ్లమ్ముతోంది.

దాదాపు 50 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సునీత బోయ దీన పరిస్థితి ఇది.! సినీ ప్రపంచంలో అదృష్టాన్ని పరీక్షించుకుందాని భాగ్యనగరానికి వచ్చి.. చివరికి రోడ్డు పక్కన పండ్లు అమ్ముకునే పరిస్థితుల్లో కనిపించింది. వెంకీమామ, సైరా నరసింహా రెడ్డి, అజ్ఞాతవాసి, సరైనోడు లాంటి బ్లాక్‌బస్టర్ మూవీల్లో నటించినప్పటికీ.. సగటు క్యారెక్టర్ ఆర్టిస్టుకు వచ్చే కష్టాలు ఆమెను వదల్లేదు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో మలక్‌పేట్ మెయిన్ రోడ్డుపై పండ్లు అమ్ముకుంటూ బతుకు బండిని లాగుతుంది.

Shireesha

Shireesha

Next Story