Sunil: రామ్ చరణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న సునీల్

Sunil: బన్నీ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా పైన ఆశలు పెట్టుకున్న సునీల్

admin1
Updated on: 27 Dec 2021 8:00 PM IST
Sunil Next Film with Ram Charan RC15 | Tollywood News
X

బన్నీ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా పైన ఆశలు పెట్టుకున్న సునీల్

Sunil: ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న సునీల్ హీరోగా మారాక ఒకటి రెండు హిట్ సినిమాలు అందుకున్నప్పటికీ కెరీర్ పరంగా సక్సెస్ కాలేకపోయారు. ఇక తాజాగా మళ్లీ కమెడియన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సునీల్ మరోవైపు విలన్ పాత్రలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అవి కూడా అనుకున్నంత స్థాయిలో సునీల్ కి మంచి పేరు తెచ్చి పెట్టలేక పోయాయి. ఈ మధ్యనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "పుష్ప" సినిమాలో విలన్ పాత్ర పోషించారు సునీల్.

సినిమా మంగళం శీను పాత్రలో కనిపించిన సునీల్ నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నప్పటికీ ఆయన ఇంపాక్ట్ అంతగా సినిమాలో కనిపించలేదు. సునీల్ పాత్ర కంటే బన్నీ పక్కన ఉండే కేశవ పాత్ర చేసిన నటుడికి మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా #ఆర్సీ15 పైన పెట్టుకున్నారు సునీల్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం సునీల్ అయితే బాగుంటుందని దిల్ రాజు రికమెండ్ చేయగా శంకర్ సునీల్ ని సంప్రదించారట. మరి ఈ సినిమా తో సునీల్ మంచి హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

admin1

admin1

Next Story