అలా లేకపోతే చూడరు అంటున్న సునీల్

అలా లేకపోతే చూడరు అంటున్న సునీల్
x
Highlights

హీరోగా కొన్ని సినిమాలు చేసి డిజాస్టర్ ల ను అందుకున్న సునీల్ ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా మారిపోయి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా...

హీరోగా కొన్ని సినిమాలు చేసి డిజాస్టర్ ల ను అందుకున్న సునీల్ ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా మారిపోయి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా నటిస్తున్నప్పుడు సిక్స్ ప్యాక్ చేశారు కానీ ఇప్పుడు ఎందుకు వదిలేసారు అని అడగగా తెలుగు ప్రేక్షకులు, అలానే కోరుకుంటున్నారని అన్నారు సునీల్. బార్టెండర్ లా సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేస్తే కమెడియన్ గా అనిపించటంలేదు ఏమో అంటూ చురకలు వేశారు. యాక్షన్‌ హీరో గా మారడం వల్లనే అవకాశాలు తగ్గిపోయాయా అని అడగగా, సునీల్ రియాక్ట్ అయ్యారు.

అసలు తాను యాక్షన్ హీరోగా మారాలని అనుకోలేదని, టాలీవుడ్ లో యాక్షన్ కామెడీ చేసే వారు తక్కువగా ఉన్నారు కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడొచ్చు కదా అని ఒకరు సలహా ఇవ్వగా అలా చేశానని చెప్పుకొచ్చారు. ఉన్న ప్లేస్ ని బట్టి ఆలోచన మారుతూ ఉంటుందని అన్నారు సునీల్. అంతేకాక తెలుగులో హీరో ఫాదర్ పాత్ర అంటే పొట్టలు ఉంటాయి కానీ చైనాలో తండ్రి పాత్రకు కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది, హాలీవుడ్, చైనా మైండ్ సెట్ వేరు తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ వేరు అని, ల్యాండ్ ని బట్టి మైండ్ సెట్ మారుతూ ఉంటుందని అన్నారు సునీల్. ప్రస్తుతం 'చిత్రలహరి' సినిమా సక్సెస్ ను బాగా ఆస్వాదిస్తున్నానని ఈ సినిమా తనకు మరొక పిల్లర్ల గా మారుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories