రజనీకాంత్ సినిమాలో కీలక పాత్రలో సునీల్

* మళ్లీ ఇన్నాళ్లకు సూపర్ స్టార్ తో చేతులు కలపనున్న సునీల్

Dhatripriya
Updated on: 18 Jan 2023 8:15 AM IST
Sunil In A Key Role In Rajinikanth Film
X

రజనీకాంత్ సినిమాలో కీలక పాత్రలో సునీల్

Jailer: కమెడియన్ గా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన సునీల్ ఆ తర్వాత హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ చాలా వరకు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక గత కొంతకాలంగా సునీల్ మళ్లీ కమెడియన్ లేదా విలన్ పాత్రలలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ మధ్యనే అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప లో కూడా విలన్ పాత్రలో కనిపించిన సునీల్ తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రజనీకాంత్ "జైలర్" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. "కొలమావు కోకిల", "డాక్టర్" వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. నెల్సన్ మరియు రజనీకాంత్ ల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో సునీల్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి సునీల్ ఫోటోలు కూడా కొన్ని విడుదలయ్యాయి. విభిన్న లుక్కుతో సునీల్ ఈ ఫోటోలతో అందరూ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు 2008 లో రజనీకాంత్ కథానాయకుడు సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు రజనీకాంత్ సినిమాలు కనిపించడానికి రెడీ అవుతున్నారు సునీల్.

Dhatripriya

Dhatripriya

Next Story