ఆ స్టార్ దర్శకుడు నాకు గ్లాస్ మేట్ అంటున్న సునీల్

ఆ స్టార్ దర్శకుడు నాకు గ్లాస్ మేట్ అంటున్న సునీల్
x
Highlights

కొంతకాలం హీరోగా నటించిన తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సునీల్ ఈ మధ్యనే మళ్ళీ కమెడియన్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే కమెడియన్ గా కూడా కొన్ని...

కొంతకాలం హీరోగా నటించిన తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సునీల్ ఈ మధ్యనే మళ్ళీ కమెడియన్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే కమెడియన్ గా కూడా కొన్ని ఫ్లాపులను ఎదుర్కొన్న సునీల్ కు ఎట్టకేలకు 'చిత్రాలహరి' సినిమాతో మంచి సక్సెస్ అందింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ గ్లాస్ మేట్ గా సునీల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సునీల్ తన రియల్ లైఫ్ గ్లాస్మేట్ దర్శకుడు త్రివిక్రమ్ అని చెప్పుకొచ్చాడు. "నాకంటే త్రివిక్రమ్ ఒక ఏడాది పెద్దవాడు, త్రివిక్రమ్ కంటే ముందే నేను హైదరాబాద్ కు వచ్చాను. ఆ తర్వాత నా కోసం త్రివిక్రమ్ ను తీసుకు వచ్చాను" అని అన్నాడు సునీల్.

"నా జీవితంలో ప్రతి సంఘటన, ప్రతి విషయం గురించి త్రివిక్రమ్ తో చర్చిస్తాను. తనతో కొంచెం సేపు మాట్లాడినా నాకు బోలెడంత ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక నెలలో కనీసం రెండు సార్లైనా ఇప్పటికీ కలుస్తూ ఉంటాం. అని సునీల్ చెప్పుకొచ్చాడు. అంతేకాక ఇబ్బందులు పడుతున్న సమయంలో త్రివిక్రమ్ తనకు వెన్నంటే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అంతేకాక త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా సునీల్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories