A1 Express Trailer: హాకీ కోచ్ అంటే షారుఖ్ ఖానే అనుకుంటున్నారయ్యా!

A1 express
x

అ౧ Express

Highlights

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'A1 ఎక్స్‌ప్రెస్‌'. సందీప్ కిషన్ 25వ చిత్రంగా...

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'A1 ఎక్స్‌ప్రెస్‌'. సందీప్ కిషన్ 25వ చిత్రంగా వస్తుంది. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. తెలుగులో వస్తోన్న తొలి హాకీ నేపథ్య చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం 'A1 ఎక్స్‌ప్రెస్' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చింది. భారతదేశం తొలి హాకీ ప్రపంచకప్‌ను గెలుచుకుంది.. హాకీని జాతీయ క్రీడగా దేశం ప్రకటించింది. అనే కథనాలతో ట్రైలర్‌ను ప్రారంభించారు. 'ఇండియాలో సగం మంది హాకీ కోచ్ అంటే ఇంకా షారుఖ్ ఖానే అనుకుంటున్నారయ్యా బాబు' అంటూ రావు రమేష్ చెప్పే డైలాగు అదిరిపోయింది. ఇక హాకీ ప్లేయర్‌గా సందీప్ కిషన్ లుక్ ఓ రేంజ్ లో ఉంది.

సందీప్ కిషన్ పరిచయం చేస్తూ వచ్చే డైలాగ్.. మన దేశంలో స్పోర్ట్స్‌మ్యాన్‌కు ఇవ్వాల్సిన కనీసం గౌరవం కూడా ఇవ్వడంలేదు సార్. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలమైంది. ఏ స్పోర్ట్ చూడాలో ఏ స్పోర్ట్ చూడకూడదో బిజినెస్ మ్యానే డిసైడ్ చేస్తున్నాడు. అసలు ఇక్కడ ఆడాలంటేనే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది సార్' అంటూ సందీప్ డైలాగు మనస్సుకు కనెక్ట్ అవుతుంది.

లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ, రాహుల్ రామ‌కృష్ణ, పోసాని కృష్ణముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్య,మ‌హేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్‌, భూపాల్‌, సుద‌ర్శన్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి, ఖ‌య్యుమ్‌ ముఖ‌్య పాత్రల్లో నటించారు. హిపాప్ బాణీలు అందించాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories