SSMB28: సమ్మర్ ఎఫెక్ట్..సంక్రాంతి రేసు నుంచి #SSMB28 ఔట్?

Summer Effect #SSMB28 out of Sankranti Race?
x

SSMB28: సమ్మర్ ఎఫెక్ట్..సంక్రాంతి రేసు నుంచి #SSMB28 ఔట్?

Highlights

SSMB28: అనుకున్న ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే మాత్రం మహేష్ బాబు లేని సీన్స్ ని త్రివిక్రమ్ షూట్ చేసుకోవాల్సి ఉంటుంది.

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. #SSMB 28 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా..ఇందులో సూపర్ స్టార్ సరసన పూజాహెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి ఘట్టమనేని అభిమానులను త్రివిక్రమ్ ఖుషీ చేశాడు. ఫస్ట్ లుక్ లో మహేష్ బాబుని ఊర మాస్ గా చూపించి సినిమాపై అంచనాలను పెంచేశాడు. అయితే హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో సూపర్ స్టార్ షాక్ ఇచ్చాడు.

#SSMB28 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా సినిమాని సంక్రాంతి రిలీజ్ గా ప్రకటించారు. కానీ, సూపర్ స్టార్ వరుస చూస్తుంటే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం డౌటే అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, సినిమా షూటింగ్ ని మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని త్రివిక్రమ్ కు మహేష్ బాబు చెప్పాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సమ్మరే కారణం అని అంటున్నారు.

మహేష్ బాబుకి స్కిన్ ఎలర్జీ ఉంది. ఆయన వేసవి కాలంలో షూటింగ్స్ చేయడు. ప్రతి సమ్మర్ కి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లడం రివాజు. ఎప్పటిలానే ఈసారి కూడా రెండు మూడు వారాల పాటు ఫారిన్ వెకేషన్ వెళ్లనున్నాడు. అయితే #SSMB28 రిలీజ్ కి సంక్రాంతి వరకు టైమ్ ఉంది కాబట్టి...మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ వెళ్లినా పెద్ద అడ్డంకి కాదని ఫ్యాన్స్ భావించారు. సాధారణంగా మహేష్ బాబు వంద రోజులు షూటింగ్ చేస్తే మిగిలిన 264 రోజులు ఫారిన్ ట్రిప్స్ లోనే ఉంటాడు. కానీ, ఇప్పుడు మూడు నెలలు బ్రేక్ తీసుకుంటున్నాడని వార్తలు రావడంతో #SSMB28పై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

మహేష్ బాబు నిజంగానే 3 నెలలు బ్రేక్ తీసుకుంటే అది #SSMB28 రిలీజ్ పై ఎఫెక్ట్ పడడం ఖాయం. అనుకున్న ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే మాత్రం మహేష్ బాబు లేని సీన్స్ ని త్రివిక్రమ్ షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అది సాధ్యపడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదిఏమైనా, సూపర్ స్టార్ తీసుకున్న నిర్ణయం నిజమే అయితే #SSMB28 వచ్చేది నెక్ట్స్ సమ్మర్ కే.

Show Full Article
Print Article
Next Story
More Stories