Kapatadhaari Movie Trailer: 'క‌ప‌ట‌ధారి'కి సమంత మద్దతు

సుమంత్ హీరోగా ప్రదీప్ క్రిష్ణమూర్తి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘క‌ప‌ట‌ధారి’.

Samba Siva Rao
Published on: 12 Jan 2021 7:34 PM IST
Kapatadhaari Movie Trailer: క‌ప‌ట‌ధారికి సమంత మద్దతు
X

కపటధారి మూవీ 

సుమంత్ హీరోగా ప్రదీప్ క్రిష్ణమూర్తి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'క‌ప‌ట‌ధారి'. క‌న్నడలో విజయం సాధించిన 'కవలుదారి' సినిమాకు ఇది తెలుగు రీమేక్ గా వస్తుంది‌. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. 'సుబ్రహ్మణ్యపురం', 'ఇదంజ‌గ‌త్‌' చిత్రాల‌తో పర్వాలేదనిపించారు సుమంత్. ఇప్పుడు 'క‌ప‌ట‌ధారి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన 'కపటధారి' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజా అక్కినేని వారి కోడలు సమంత చేతుల మీదుగా విడుదల అయిన 'కపటధారి' ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ పాత్రలో సుమంత్ నటించారు. మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని అస్తిపంజరాలు బయటపడతాయి. అవి ఎవరివి? ఎవరు హత్య చేశారు? వంటి విషయాలతో సాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ మూవీ. ఈ ఇన్వెస్టిగేషన్‌లో ట్రాఫిక్ ఎస్ఐ అయిన సుమంత్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమిటి అనేది సినిమాలోనే చూడాలి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'కపటధారి'విడుదలకు సిద్ధంగా ఉంది.

జి.ధనంజయన్ సమర్పణలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ పతాకంపై లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ సరసన నందితా శ్వేత నటించారు. పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ సంగీతం సమకూర్చారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story