బిగ్ బాస్ లోకి సుమ.. వైల్డ్ కార్డు ఎంట్రీనా? ప్రోమోనా?

బిగ్ బాస్ లోకి సుమ.. వైల్డ్ కార్డు ఎంట్రీనా? ప్రోమోనా?
x
Highlights

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ షో అంతగా ఆకట్టుకోకపోవడంతో షో నిర్వాహకులు బాగానే ప్లాన్ చేస్తున్నారు.. దసరా సందర్భంగా హోస్ట్ గా అక్కినేని వారి కోడలు సమంతని తీసుకువచ్చి ఓ ఎపిసోడ్ ని చేయించారు షో నిర్వహకులు..

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ షో అంతగా ఆకట్టుకోకపోవడంతో షో నిర్వాహకులు బాగానే ప్లాన్ చేస్తున్నారు.. దసరా సందర్భంగా హోస్ట్ గా అక్కినేని వారి కోడలు సమంతని తీసుకువచ్చి ఓ ఎపిసోడ్ ని చేయించారు షో నిర్వహకులు.. ఆ ఎపిసోడ్ లో సమంతతో పాటుగా హీరో కార్తికేయ‌, హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్, హైప‌ర్ ఆది, అక్కినేని అఖిల్‌ల‌ని రంగంలోకి దింపారు. అయితే ఆ షోకి బాగా టీఆర్పీ వచ్చింది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తమిళ్ భాష నటుడు కమల్ హసన్ పుట్టినరోజు సందర్భంగా నాగార్జునతో వ‌ర్చ్యువ‌ల్ ద్వారా మాట్లాడేలా చేశారు.. ఒకే వేదికపైన ఇద్దరు పర భాష నటులను చూపించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు..

ఇక ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్‌పై యాంకర్ సుమ సందడి చేయనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ సుమ‌ని బిగ్ బాస్ స్టేజ్‌పైకి ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున.. స్టేజీ పైన తనదైన పంచులతో ఆకట్టుకుంది సుమ.. ఆమె పంచులకి ఇంటి సభ్యులు మాత్రమే కాదు.. నాగార్జున కూడా తట్టుకోలేకపోయాడు.. ఇక ప్రోమో చివరలో సుమ హౌజ్‌లోకి వెళుతున్న‌ట్టుగా చూపించారు.. మరి నిజంగానే సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందా లేకా ప్రోమో వ‌ర‌కేనా అన్నది తెలియాల్సి ఉంది.. అటు బిగ్ బాస్ లోకి ఇప్పటివరకు సాయి, అవినాష్‌, స్వాతి దీక్షిత్‌లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు..


Show Full Article
Print Article
Next Story
More Stories