Sulthan: ఓటీటీలో 30న స్ట్రీమింగ్.. అదే రోజు మరో బ్లాక్ బస్టర్ బొమ్మ

Sulthan Movie in OTT: తమిళ నటుడు కార్తీ, ర‌ష్మిక మందాన్న హీరోహీరోయిన్లగా రూపొందిన చిత్రం 'సుల్తాన్'.

Samba Siva Rao
Updated on: 28 April 2021 1:26 PM IST
Sulthan Movie On Aha
X

సుల్తాన్ (ఇమేజ్ సోర్స్: అహా)

Sulthan Movie in OTT: తమిళ నటుడు కార్తీ, ర‌ష్మిక మందాన్న హీరోహీరోయిన్లగా రూపొందిన చిత్రం 'సుల్తాన్'. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీనా విడుదలైంది. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జోనర్ లో రూపోందింది. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందాన్న ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ హా సూపర్ హిట్ సినిమాలు, వరుస షోలతో దుసూకుపోతున్న విషయం తెలిసిందే. కాక్ర్, నాంది, గాలిసంపత్ , జాంబిరెడ్డి, తెల్లవారితే గురువార వంటి సూపర్ హిట్ చిత్రాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి జోరు మీదవుంది. తాజాగా ఆహా 'సుల్తాన్' మూవీ కూడా ప్రసారం చేయనుంది. కార్తీ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ నెల 30న ఆహాలో సుల్తాన్ స్ట్రీమింగ్ కానుంది.

ఇటీవలే టాలీవుడ్ అగ్రకథానాయక సమంత‌తో సామ్ జామ్ షో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఆ షో విజయవంతం కావడంతో రానా హోస్ట్‌గా చేసిన నెంబర్ వన్ యారీ మూడో సిజన్ డిజిటల్ రైట్స్ కోనుగోలు చేసింది. ఆహా వెబ్ సిరీస్‌లో రూపొందించడంలో స్పీడ్ పెంచింది. ఆహా టీమ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన '11th అవర్‌' అనే వెబ్ సిరీస్ ప్రసారం చేసింది.

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ మూవీ ఏప్రీల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే.ఈ మూవీ కూడా ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. థమన్ సంగీతం అందించగా మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story