ఆ రెండు సినిమాలు రీరిలీజ్ చేస్తే చూడాలని ఉందంటున్న సుకుమార్ భార్య

* సుకుమార్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తెలుసుకోవాలి అనుకుంటున్న సుకుమార్ భార్య

Dhatripriya
Updated on: 16 April 2023 7:31 PM IST
Sukumars Wife Is Asking For Rerelease Of Sukumars Movies
X

సుకుమార్ సినిమాలని రీ రిలీజ్ చేయమని కోరుతున్న సుకుమార్ భార్య

Sukumar Movies: ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు రికార్డులు సృష్టించిన సినిమాలు మళ్లీ విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తున్నాయి. అయితే ఒకప్పుడు డిజాస్టర్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమా కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్యనే మార్చిలో రీ రిలీజ్ అయిన ఈ సినిమా వరుసగా హౌస్ ఫుల్ అయ్యి రికార్డులు సృష్టించింది.

ఆరెంజ్ లాంటి సినిమాకి అప్పుడు ప్రేక్షకులు రెడీగా లేరని కానీ ఇప్పుడు ఇలాంటి సినిమా విడుదలయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ భార్య కూడా సుకుమార్ దర్శకత్వం వహించి డిజాస్టర్ అయిన రెండు సినిమాలు మళ్లీ విడుదల అయితే చూడాలని ఆశిస్తున్నారట. "జగడం మరియు 1 నేనొక్కడినే సినిమాలని మళ్ళీ రిలీజ్ చేయమని నేను సుకుమార్ ని అడుగుతున్నాను.

ఈ సినిమాలో విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ కాలేకపోయారో తెలుసుకోవాలని ఉంది లేదా ఒకవేళ మళ్లీ రీ రిలీజ్ అయినా కూడా ఈ సినిమాలు ఫ్లాప్ అవుతాయా అని తెలుసుకోవాలని ఉంది," అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పకొచ్చారు స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్. ఈ కామెంట్లతో అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. ఆ రెండు సినిమాలు కూడా చాలా ముందు విడుదల అయ్యాయని ఇప్పుడు విడుదల అయ్యుంటే బాగుండేది అని అంటున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story