బుచ్చిబాబు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్

*బుచ్చిబాబు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్

Rama Rao
Updated on: 29 May 2022 9:31 PM IST
Sukumar Will Help Buchi babu | Tollywood News
X

బుచ్చిబాబు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్

Sukumar: సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అందులో ఒకరు బుచ్చిబాబు సన. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ ఉప్పెన అనే సినిమాతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే మర్చిపోలేని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు బుచ్చిబాబు సనా కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేసే అవకాశం లభించింది.

ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు.ఈనేపథ్యంలో బుచ్చిబాబు సనా తన రెండవ సినిమా మరో హీరోతో మొదలు పెడదామా అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సుకుమార్ కూడా అ బుచ్చిబాబుకి సహాయం చేస్తున్నట్లు సమాచారం.

మరి బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తూ ఉండలేక ఈ గ్యాప్ లో మరో హీరోతో సినిమాని పట్టాలక్కిస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా "పుష్ప: ది రైజ్" కి సీక్వెల్ అయిన "పుష్ప: ది రూల్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Rama Rao

Rama Rao

Next Story