Pushpa 2 The Rule: అల్లు అర్జున్ లేకుండానే పుష్ప 2 షూటింగ్ షురూ..

Sukumar to shoot pushpa second part in foreign forests
x

ఫారిన్ అడవుల్లో "పుష్ప" షూటింగ్ అంటున్న దర్శకుడు సుకుమార్ 

Highlights

* "పుష్ప: ది రూల్" సినిమా కోసం మాత్రం సుకుమార్ అక్కడే షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప: ది రైజ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఎర్రచందనం నేపథ్యంలో సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప ది రూల్" పైనే అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి.

ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ కోసం వేసిన కొన్ని సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమాలో కీలకపాత్రలో పోషిస్తున్న నటీనటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తన బంధువుల పెళ్లి కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు కాబట్టి అల్లు అర్జున్ ఈ షూటింగ్లో ఇంకా పాలు పంచుకోవడం లేదు.

మరొక వారంలో అల్లు అర్జున్ హైదరాబాద్ కి తిరిగి వచ్చాక షూటింగ్లో చేరబోతున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం బ్యాంకాక్ మరియు చైనాలోని కొన్ని అడవుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనుంది. నిజానికి మొదటి భాగం షూటింగ్ బ్యాంకాక్ అడవుల్లో జరగాల్సింది కానీ అప్పట్లో కరోనా కారణంగా మారేడుమిల్లి అడవిలో షూటింగ్ జరిగింది. అయితే "పుష్ప: ది రూల్" సినిమా కోసం మాత్రం సుకుమార్ బ్యాంకాక్ లోనే షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories