Sukumar: "పుష్ప తరువాతే ఎవరైనా," అంటున్న సుకుమార్

Sukumar says  Anyone after Pushpa
x

Sukumar: "పుష్ప తరువాతే ఎవరైనా," అంటున్న సుకుమార్

Highlights

Sukumar: "పుష్ప" తర్వాత నెక్స్ట్ సినిమా విషయంలో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

Sukumar: ఈ మధ్యనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "పుష్ప" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ తో పాటు "వేర్ ఈజ్ పుష్ప" అంటూ ఒక అదిరిపోయే టీజర్ ని కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే మరోవైపు ఈ సినిమా తర్వాత సుకుమార్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నిజానికి "పుష్ప" సినిమా షూటింగ్ సమయంలో సుకుమార్ విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశారు. 1975 వార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో విజయ్ ఒక సైనికుడి పాత్ర పోషిస్తారని టాక్ కూడా వినిపించింది. కానీ "పుష్ప" సినిమా అనుకున్న దాని కంటే పెద్ద విజయాన్ని సాధించింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "లైగర్" సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

"పుష్ప" సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయిన సుకుమార్ వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తారా అని అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప తర్వాత రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా చేయాలని ఈ ప్లాన్ చేస్తున్నారు. మరి సుకుమార్ పుష్ప తర్వాత విజయ్ దేవరకొండ మరియు రామ్ చరణ్ లలో ఎవరిని ఎంచుకుంటారో వేచి చూడాలి. ఏదేమైనా సుకుమార్ "పుష్ప" సినిమా విడుదల తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచనలు మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories