సుకుమార్ జాగ్రత్తలు వహిస్తున్న మూడు విషయాలు

సుకుమార్ జాగ్రత్తలు వహిస్తున్న మూడు విషయాలు
x

సుకుమార్ జాగ్రత్తలు వహిస్తున్న మూడు విషయాలు

Highlights

Sukumar: మూడు విషయాల్లో ఇంపాక్ట్ అయిన సుకుమార్

Sukumar: స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ మధ్యనే "పుష్ప: ది రైజ్" సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా "పుష్ప: ది రూల్". అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించనుంది. సునీల్, అనసూయ, ఫాహాద్ ఫాసిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది.

అయితే ఈ సినిమా విషయంలో సుకుమార్ ని మూడు విషయాలు బాగా ఇంపాక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో మొట్ట మొదటిది "కే జి ఎఫ్: చాప్టర్ 2" సక్సెస్. కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా వల్ల షాకైన తెలుగు దర్శకులలో సుకుమార్ కూడా ఒకరు. అటువంటి ఆసక్తికరమైన, ఇంటెన్స్ స్క్రీన్ప్లే చూసి సుకుమార్ షాక్ అయ్యారట. మరోవైపు "పుష్ప: ది రూల్" సినిమా కోసం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాక హిందీ లో కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా సినిమా ఉండాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇక మూడవది సినిమా బడ్జెట్. సినిమా చాలా బాగా రావాలంటే బడ్జెట్ కూడా అంతే ఖర్చు అవుతుంది. ఈ మూడు విషయాల్లోనూ సుకుమార్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories