Sukumar: రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుకుమార్

Sukumar: రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుకుమార్

Rama Rao
Published on: 18 Oct 2022 8:20 PM IST
Sukumar is Planning a Sequel to Ram Charans Rangasthalam Movie | Tollywood News
X

Sukumar: రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుకుమార్

Sukumar: సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమా మెగా అభిమానులకు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక చెవిటి వాడి పాత్రలో నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో రామ్ చరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. అయితే తాజాగా కన్నడలో ప్రముఖ హీరో రిషబ్ శెట్టి ఈ మధ్యనే "కాంతారా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

తానే స్వయంగా రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ కూడా చాలా వరకు రంగస్థలం సినిమాకి దగ్గరగానే ఉంటుంది. దేవుడి కాన్సెప్ట్ పక్కన పెడితే కథ రెండు సినిమాల కథ ఒకటే అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద నెక్స్ట్ లెవెల్ లో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "రంగస్థలం" సినిమా పై కూడా చర్చలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ "రంగస్థలం" సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి "రంగస్థలం 2" ఐడియా ని చెప్పారని దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సుకుమార్ రామ్ చరణ్ హీరోగా రంగస్థలం 2 సినిమా చేయనున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా కూడా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సినిమాని పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story