Sukumar: పదేళ్లపాటు బిజీ కాబోతున్న సుకుమార్

Sukumar Is Going To Be Busy For Ten Years
x

Sukumar: పదేళ్లపాటు బిజీ కాబోతున్న సుకుమార్

Highlights

Sukumar: సుకుమార్ లైన్ అప్ లో పదేళ్లదాకా ఖాళీ లేదుగా..

Sukumar: "పుష్ప: ది రైజ్" సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం సుకుమార్ చేతినిండా బోలెడు ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయి. అయితే ప్రస్తుతం సుకుమార్ "పుష్ప" రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత కూడా సుకుమార్ దాదాపు 10 ఏళ్లపాటు పెద్ద లైన్ అప్ తో బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి అవడానికి సంవత్సరకాలం పడుతుంది.

ఆ తర్వాత సుకుమార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి కనీసం రెండేళ్లయినా సమయం పడుతుంది. ఆ తర్వాత సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఒక సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. ప్రభాస్ తో సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ తో సినిమాని పట్టాలెక్కించనున్నారు సుకుమార్.

ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత సుకుమార్ పుష్ప కి మరొక భాగమైన "పుష్ప 3" గురించి ప్లాన్ చేయబోతున్నారు. ఈ మధ్యనే పుష్ప: 3 గురించి కూడా ఐడియా వచ్చిందని దీనికి సంబంధించిన లైన్ కూడా బన్నీకి చెప్పగా బన్నీ ఓకే చెప్పేసారని తెలుస్తుంది. కేవలం ఈ మూడు సినిమాలు పూర్తి చేయడానికి సుకుమార్ కి ఆరేళ్లు పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక మధ్యమధ్యలో సుకుమార్ తీసుకునే గ్యాప్ ల గురించి కూడా కలుపుకుంటే పదేళ్ల వరకు సుకుమార్ బిజీ అని చెప్పుకోవచ్చు. కానీ తన స్పీడును పెంచి సుకుమార్ ఒక్కో సినిమాని ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories