రష్మిక పాత్ర ని కట్ చేస్తున్న సుకుమార్

*రష్మిక పాత్ర ని కట్ చేస్తున్న సుకుమార్

Rama Rao
Updated on: 18 Jun 2022 2:00 PM IST
Sukumar is Cutting the Role of Rashmika Mandanna in Pushpa-2 Movie
X

రష్మిక పాత్ర ని కట్ చేస్తున్న సుకుమార్

Pushpa-2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర కథకు ఎంతో కీలకం కాకపోయినప్పటికీ ఆమె గ్లామర్ షో సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప రెండవ భాగమైన "పుష్ప: రూల్" సినిమాలో మాత్రం సుకుమార్ రష్మిక పాత్రని చాలా వరకు కట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో రష్మిక మందన్న అభిమానులకి పెద్ద షాకే తగిలింది. రష్మిక పోషిస్తున్న శ్రీవల్లి పాత్ర నిడివిని "పుష్ప: ది రూల్" సినిమాలో బాగా తగ్గించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ సిండికేట్ చూసుకోవడం లో భాగంగా అడవుల్లోనూ, కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలలోనూ స్మగ్లింగ్ డీల్స్ మాట్లాడడానికి తిరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు పుష్పరాజ్ ని పట్టుకోవడం కోసం శ్రీవల్లి ని వాడుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, తన పాత్రని చంపేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇక పుష్ప కి మూడవ భాగం తీసే ఆలోచన సుకుమార్కి లేదని కానీ రెండవ భాగంలో శ్రీవల్లి పాత్ర మృతితో ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story