Pushpa Release Date: "పుష్ప 1" విడుదల తేదీని ఖరారు చేసిన దర్శక నిర్మాతలు

Sukumar Director and Producers Planning to Release the Pushpa Movie on 17th December 2021
x

పుష్ప మూవీ విడుదల తేదీ ఖరారు (ఫోటో- ది హన్స్ ఇండియా )

Highlights

Pushpa Release Date: డిసెంబర్ 17న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Pushpa Release Date: ప్రస్తుతం అల్లు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప''. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్య", "ఆర్య 2" సినిమాల తర్వాత బన్నీ సుక్కు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతోంది. కానీ ఈ చిత్ర విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 17న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కాకినాడ పోర్ట్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ ఈ సినిమాలో విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అనసూయ భరద్వాజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తిరుగుతూ ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories