రాజమౌళి తర్వాత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ ఎవరో తెలుసా!!

Sukumar Comes Close to Rajamouli Remuneration
x

రాజమౌళి తర్వాత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ ఎవరో తెలుసా!!

Highlights

Tollywood Directors Remuneration: ప్రస్తుతం ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పుకోవచ్చు.

Tollywood Directors Remuneration: ప్రస్తుతం ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పుకోవచ్చు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి ఒక్కో సినిమాకి 100 కోట్లు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇక రాజమౌళి తర్వాత అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ సుకుమార్. రంగస్థలం సినిమా తోనే బ్లాక్ బస్టర్ సృష్టించిన సుకుమార్ ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు.

తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాలుగు వందల కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకున్న ఈ సినిమా సీక్వెల్ "పుష్ప: ది రూల్" త్వరలో తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం "పుష్ప: ది రూల్" సినిమా కోసం సుకుమార్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా నుంచి కొంత షేర్లు కూడా సుకుమార్ కి దక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు త్రివిక్రమ్ కూడా దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఏదేమైనా ఈమధ్య డైరెక్టర్లు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమ రెమ్యూనరేషన్ ను కూడా బాగానే పెంచేస్తున్నారు. కానీ తమకున్న క్రేజ్ మరియు టాలెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు సైతం అంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories