Suhas: "రైటర్" కారణంగా సుహాస్ కి పెరిగిన డిమాండులు..

Suhas: "రైటర్" తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన సూహాస్

Dhatripriya
Updated on: 9 March 2023 9:30 PM IST
Suhas Increased His Remuneration After Writer Padmabhushan
X

Suhas: "రైటర్" కారణంగా సుహాస్ కి పెరిగిన డిమాండులు..

Suhas: షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ను మొదలుపెట్టి ఆ తరువాత పడి పడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, వంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ "కలర్ ఫొటో" సినిమాతో హీరోగా కూడా మారాడు. ఈ మధ్యనే "హిట్ 2" సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో అందరినీ భయపెట్టించిన సుహాస్ "రైటర్ పద్మభూషణ్" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు.

సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సుహాస్ కి ఉన్న డిమాండ్ కూడా బాగా పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుహాస్ తన రెమ్యూనరేషన్ ని కూడా బాగా పెంచేసాడని తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం సుహాస్ కి ఇప్పుడు హీరోగా బోలెడు ఆఫర్లు వస్తున్నాయని సుహాస్ కూడా మంచి కథలను ఎంచుకోవడంతో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

అంతేకాకుండా ఇకపై చేస్తున్న సినిమాలకి సుహాస్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. మరి సుహాస్ డిమాండ్ ని ఒప్పుకొని నిర్మాతలు కూడా అంత రెమ్యూనరేషన్ ఇస్తారా లేదా అనేది ఇంకా వేచి చూడాలి. ప్రస్తుతం సుహాస్ "ఆనందరావు అడ్వెంచర్స్" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు జూనియర్ ఆర్టిస్ట్ లాగా అంతేకాకుండా విలన్ పాత్రలతో కూడా సుహాస్ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story