Sudigali Sudheer: రెండేళ్లు ఇలానే ఎంజాయ్ చేస్తానంటోన్న సుడి 'గాలోడు'

Sudigali Sudheer: బుల్లితెరపై సుడిగాలి సుధీర్ తెలియని వారుండరేమో.

Venkata Chari
Published on: 21 May 2021 12:12 PM IST
Sudigali Sudheer Said No Marriage For Two Years | Sudigali Sudheer New Movie
X

సుధీర్ (ఫొటో ట్విట్టర్)

Sudigali Sudheer: బుల్లితెరపై సుడిగాలి సుధీర్ తెలియని వారుండరేమో. జబర్ధస్త్ తో వెలుగులోకి వచ్చి.. పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. మరోవైపు యాంకర్‌ రష్మీతో లవ్‌ లో ఉన్నాడనే పుకార్లతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వీరిద్దరు చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా.. వీరి పెళ్లి రూమర్లకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. సుధీర్‌ ఇటీవల 34వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ జంట పెళ్లిపై వార్తలు వెలువడుతున్నాయి.

తాజాగా మరోసారి వీటికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం సుధీర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదని, మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలని ఫిక్స్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా సుధీర్, రష్మీ పెళ్లి వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.

మరోవైపు సుధీర్‌కు వెండితెర అంతగా కలిసి రావడంలేదు. సుధీర్‌ హీరోగా నటించిన 'సాఫ్ట్ వేర్ సుధీర్', 'త్రీ మంకీస్' రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో 'గాలోడు' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుధీర్‌ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

Venkata Chari

Venkata Chari

Next Story